ర త్నం-సత్యవాణి

 రామనగర్ గ్రామంలో
రత్నమొకటి పుట్టెను
పువ్వు పుట్టినంతలోనె
పుప్పొడి వెదజల్లెను
పేదరికము ఏమాత్రము
పెరగ అడ్డు కాదుగా
విద్య కొరకు ఎంతగానొ
వలపలాడి పోయెను
పావల డబ్బులు లేక
పెను గంగనుఈదెను
శాస్త్రి అనే పట్టాను
సంతసముగ అందెను
రాజకీయ రంగమున
రత్నముగా మెరిసెను
అంచ అంచలుగా ఎదిగి
అధి నాయకుడాయెనుఋ
స్వార్థమింత లేనట్టి
స్వఛ్ఛత పాటించెను
నీతి మారు పేరుగా
నిర్మలుడై నిలచెను
ఒక్కమారు అతని కొడుకు
వద్దన్నా వినకను
ప్రభుత కారు వాడెను
చింతతోడి ఆ నేత
చెల్లించె స్వధనమును
జై జవాన్ జై కిసానని
జాగృతించె ప్రజలను
దేశమాత సేవలోనె
దేహము చాలించెను
లాల్ బహదుార్ రత్నమనుచు
వ్రాయబడెను చరితలో