చిన్న కోరిక :- సుకన్య
ఈ జీవిక కొక కోరిక 
అది తీరదు ఏమారదు 

ప్రపంచమును ప్రతి అంచును 
ఆమని పూయించాలని 

ప్రతి యదలో  మది మదిలో 
స్నేహ లతలు పెంచాలని 

భువిని శాంతి నించాలని 
రోదనలను  తుంచాలని 

ప్రమాదాలు లేని జగతి 
ప్రమోదాలు మించాలని 

మానవాళి కెపుడు శివుడు 
శుభమని దీవించాలని 

రోగములు, రోదనలు 
లేని జగతి గాంచాలని 

సుస్మిత వదనాలు , కనులు 
కరుణను కురిపించాలని 

అహంకార తిమిరమ్ములు 
అలుముకున్న మనసులలో 
స్నేహ భావములు ప్రమిదై 
కాంతిని ప్రసరించాలని 

శాపము , కోపము లేశము 
ఊసు   లేని ఆ భువిలో 

ఆ నందన వని దారుల 
హాయిగా చరించాలని 

ఆదమరచి మెలకువలో 
మనసు పలవరించాలని 

వసుధను వాసంతమ్ములు 
వదలక పూరించాలని .


కామెంట్‌లు