పెద్దల మాట అచ్యుతుని రాజ్యశ్రీ .


 మనం వద్దు అన్న పనిచేస్తే కోతివెధవా అని కోప్పడతారు పెద్దలు. మనిషి కూడా  అలాంటి కొంటె వెర్రిమొర్రి పనులు చేస్తే ఎలా?కోతిని చూసి మనం ముక్కుగిల్లుకుంటే దానికిబోలెడంత కోపం వస్తుంది మరి! అదిగో  అక్కడ ఓచెరువు ఉంది. గట్టుపైన చెట్టుమీద ఒక కోతి ఉంది. ఒక చేపలుపట్టేవాడు రోజు వచ్చి గాలంతో చేపలు పట్టేవాడు. వలకూడా  కొంచెం దూరం లో వేసేవాడు. ఆవలలో చేపలు గిలగిలకొట్టుకుంటూ ఎగురుతూ ఉంటే కోతికి సరదాగా  తమాషాగా  వింతగా ఉండేది. చేపలని బుట్టలో వేసుకుని  వల ను అక్కడే చెట్టుకొమ్మ కి తగిలించి వెళ్లేవాడు.ఒకరోజు  అతనురాలేదు. కోతి ఆవలను తీసి  అతని లాగానే చెరువులో విసిరింది. కానీ ఆ వల కాస్త దాని పైనేపడింది.అటుఇటు దొర్లింది.నేలపై పొర్లుతూ నాలుగు కాళ్ళతో ప్రయత్నించి అలసి సొలిసిపోయింది. లబోదిబో ఏడవ సాగింది. ఇంతలో బెస్తవాడు రానేవచ్చాడు. భయంతో భోర్  భోర్అని ఏడవ సాగింది. అతను  నవ్వు తూ"చూడు నిన్ను బంధించి  నా ఇంటికి తీసుకుని వెళ్తా.నీకు  ఆటలునేర్పి నాల్గు డబ్బులు సంపాదిస్తా.భయపడకు"అని దాన్ని  వలనించితప్పించాడు. తనతలపాగాతో దాని ముందు కాళ్ళు బంధించి  వెనక కాళ్ళ పై నడిపిస్తూ  ఇంటికి తీసుకుని వెళ్ళాడు.రకరకాల విన్యాసాలు నేర్పుతూ డబ్బు సంపాదించే వాడు. కోతి కి వేరేదారిలేదు.జీవితం అంతా  బానిసబ్రతుకే  అని లోలోన ఏడ్చుకునేది.అందుకే  పెద్దలమాట వినాలి.