వైద్యసేవలు:-సత్యవాణి

 నారాయణుడే
వైద్యుడు 
నమ్మాలిమనం
తనవారికి వ్యాధిసోకితే
తలుపులు బధించుకొనేమనమైనప్పుడు
తనకేమీ కానివారకై 
తన గుండెతలుపులు తరచి
అహర్నిశలూ సేవలందించే వైద్యుడు
ఆదినరాయణుడే
ఆగేగుండెను అరచేతితో వత్తి వత్తి ప్రాణ తిత్తిచే
పనిచేయించే పరమాత్ముడు వైద్యుడు 
వెలిగే దీపం వేలదీపాలను వెలిగించినట్లు
తన శ్వాసతో ప్రాణదీపాలు వెలిగించే 
పరమేశ్వరుడు
వైద్యుడు
తన చల్లని చేతితో
ఒక ఇల్లు వందిళ్ళు చేస్తాడు
ఇంట దీపాలను వెలిగిస్తాడు
కంటిపొపలను కాపాడతాడు
నారాయణుడే వైద్యుడు
నరుల సేవచేయడంకోసం
నరుని అవతారమెత్తాడు
నమ్మకంగా శ్రమిస్తున్నాడు