పల్లెటూరి తెలుగు బిడ్డ (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పల్లెటూరి తెలుగు బిడ్డ
ఢిల్లీ బాట పట్టినాడు
గల్లి గల్లి తిరిగి నాడు 
ఉల్లిగడ్డ అమ్మి నాడు

పల్లె భాష పలుకుతూ
వీధి వీధి తిరిగినాడు
ఊరు బిడ్డను చూసారు
తెలుగు మాట విన్నారు

పల్లె బాబును పిలిచారు
మంచి చెడులు అడిగారు
ఉల్లి గడ్డ  కొన్నారు
రొక్కం చేతికి ఇచ్చారు

కూరగాయలు తెచ్చాడు
అందరూ కలిసి కొన్నారు
కమ్మటి వంటలు చేశారు
కడుపు నిండ తిన్నారు రు