చల్లబడిన_సాయంత్రం...!!:-డాక్టర్ .కె.ఎల్వీ .
సూర్యుడు 
మడం తిప్పాడు,
భూమి 
చల్లబడింది !

ఎక్కడో ...
తుఫానో ..
వర్షాలో 
అడ్డుకుని ఉంటాయి .

సూర్యాన్ని 
ఒక తన్ను తన్ని ,
ఆకాశమంతా 
మేఘం ..
ఆక్రమించుకుంది !!

మేఘం కార్చే 
మొసలి కన్నీళ్లను 
దాటుకుని ,
సూర్యం మళ్లీ ,
తన ప్రతాపంతో 
విజృంభిస్తాడు !
మండుటెండలు 
షరా ____
మళ్ళీ మాములే !!