అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు: రామ్మోహన్ రావు తుమ్మూరి

అనురాగానికి రూపం అమ్మా
ఆప్యాయత అంటేనే అమ్మా

అమ్మ మనసు అంటేనే వెన్నకంటె మృదువనీ
అమ్మంటే ఆ దేవుని అచ్చమైన రూపమనీ
అమ్మ పాట పాడుతా కమ్మగా
మా అమ్మను పూజిస్తా ఒక దేవతగా

అమ్మవో నాన్నవో అయినప్పుడు గానీ
అమ్మ పడ్డ కష్టాలు నీకు తెలిసిరావు కదా
చంటిగుడ్డుగా ఉంటే కంటికి రెప్పై కాచే
అమ్మతనం తెలిసేదిఅనుభవమైనపుడే కదా 

బిడ్డ ఆకలెరిగినదీ సృష్టిలోన అమ్మే
బిడ్డనేడ్వనీయని అనురాగమూర్తి అమ్మే
అమ్మ ఒడి అదే బడి అదే గుడి అదే నుడి
అమ్మంటేనే ప్రేమనుమోసే ఒక కావడి
 (మాతృదినోత్సవ సందర్భంగా అమ్మలందరికీ అంకితం)


కామెంట్‌లు