అంశం:--రెక్కలు:- సత్యవాణి

 రెక్కలుగనుకా నాకుంటే
చక్కగ గగనముకెగెరెదను
చుక్కల లోకం చుట్టేసి
రిక్కల లెక్కలు తేల్చెదను
చుక్కల ముక్కలు యేరుకొని
చక్కని దండలు కట్టెదను
చుక్కవంటి సీతమ్మకు ఒకటి
చక్కని తండ్రి రామయ్యకు
మరొక్కటి
చక్కగ వెనుకు తిరిగొచ్చి
మ్రొక్కుచు గుడికి వెళ్ళెదను
చక్కని సీతారాముల మెడలో
చుక్కల దండలువేసెదను
రిక్కల వెలగులొ వారిని చూసి
చక్కగ మురిసి పోయెదను