*కళ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.కళాధికారం!
   కళాభిమానం!
   కళా ప్రవేశం!
   కళా ప్రశంస!
   మనిషికి అబ్బాలి!
  కేవలం తినడం,తొంగోడం!
  మనిషి, గొడ్డు ఒకటే!
2.కళతో జీవితం కళకళ!
   కళలేకుంటే కళ్ళులేనట్లే!
   అరవైనాలుగు కళల,
        పుట్టినిల్లు నీ దేశం!
  ఒకటైనా చేపట్టు!
  దానిమీద పట్టు!
  చేరుకో,ఆవలిగట్టు!
3.సంగీతజ్ఞులు,సాహిత్యజ్ఞులు,
    చిత్రకారులు,నృత్యకారులు,
    మహానుభావులెందరో!
    కళ కళకొరకా!కళతో,
   మానవజీవనవికాసం,  
                 కడవరకు!
4.ధనవంతుని జీవితం,
      ధనంపోతే కనుమరుగు!
  వారు ఉన్నా లేకున్నా,
      కళాకారుల కళాబలం,
   జాతికి ముందడుగు!
   కళతో రససిద్ధి! సమృద్ధి!
    అదే తత్త్వం! ఈశ్వరత్త్వం!
5.ఓ మనిషి!
    కళాంకితుడివయ్యావు!
    జీవితం సార్థకం!
   కళంకితుడిగా మిగిలావు!
    జీవితం అనర్థమే!
కళంకితుడు కాకుండా బతుకు!
   అది,కళలన్నింటికీ,
         మించిన *గొప్పకళ!*