నిజమైన అందం...అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధారణంగా ఏదైనా మనకంటిని ఆకర్షిస్తే  దాని అందాన్ని పదేపదే చూస్తూ మెచ్చుకుంటాం.మన శరీరం  కూడా అందంగా కనపడాలి అని పైపై పూతలు మెరుగు లతో అద్దంముందు నిలబడితెగచూసుకుని మురిసి పోతాం.అది తప్పు కాదు కానీ ఇతరులతో పోల్చుకోవడం బాధపడి ఆరోగ్యం చెడగొట్టుకోటం తప్పు. మంచి నడవడి ఆత్మ సౌందర్యం ముఖ్యం.   మరి కథలోకి వెళదామా?ఆఅడవిలోకి కొత్త గా ఒక ఒంటె వచ్చింది. మొదట దాన్ని  చూసి భయపడేజంతువులు దాని మంచితనం చూసి  ఆటపట్టించసాగాయి.నక్క అంది"ఛ..ఛ!నీవీపు మీద ఆ పెద్ద మట్టి గడ్డ ఏంటీ?"కోతి కిసుక్కున నవ్వుతూ"మన వీపులు సాఫుగా నునుపుగా ఉన్నాయి. గూనిఅంటారు దీనిని"అనేప్పటికి అన్ని జంతువులు పకపకా నవ్వాయి.పాపం  ఒంటెకి వారి  తుంటరి మాటలు బాధ కలిగించాయి.  అంతే తిండి తిప్పలు మానేసింది. దాని నూపురం క్రమంగా  చిక్కి మాయమై పోయింది. దాని ఆహారం అందులో  నిల్వ ఉంటుంది. అందంకోసం మూపురం కరిగించింది. ఆరోజు  తోడేలు నక్క  మాట్లాడుకోటం చెట్టుమీద ఉన్న చిలుక వింది."ఒంటె బాగా  బలహీనంగా ఉంది.దీన్ని ఇవాళ  చంపేద్దాం దూరంగా తీసికెళ్ళి. ఓవారందాకా తిండికి లోటు ఉండదు. "చిలుక ఈమాట కుందేలు  గాడిద తో చెప్పింది. కుందేలు  నక్కవీపుపై ఎక్కి దాన్ని కొరుకుతూ ఉంటే  గాడిద  తన కాళ్ళతో తోడేలు ని తన్నటం మిగతా జంతువు లన్నీ  నక్క  తోడేలు ఒళ్ళు హూనం చేశాయి.ఒంటెకి తన తప్పు తెలిసివచ్చింది. యథాతథంగా ఆహారం తిని బలంపుంజుకుని నూపురం  పెరగటం చూసి మురిసి పోయింది. ఎవరో ఏదో అన్నారని మనం జీవనశైలి మార్చుకోరాదు.మంచి అలవాట్లు  మెరుగు పరుచుకోవాలి.పరమశివుడు లింగస్వరూపుడు.కానీ అభయంకరుడు.దైవం  ప్రకృతి ని ధిక్కరించరాదు.