విలువలు...(కథ)...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనుషులంతా సమానమే.కానీ వారి నడవడి జీవితం  వారి హోదాని బట్టి  వారికి విలువగౌరవమర్యాదలు దక్కుతాయి. కుక్క మహావిశ్వాసం కలిగి ఇంటి కాపలా కాస్తుంది. అవసరమైతే తనప్రాణాన్ని ఇస్తుంది. 

సూర్యం ఆఊరి సర్పంచ్. చదువుకుని పొలంపనులు చూస్తూ అందరికీ తలలోనాలుక.అతనికిరెండు కుక్కలున్నాయి.తనకుటుంబంతో కారులోవెళ్లేటప్పుడు చిన్న సైజు కుక్క పప్పీని తీసుకుని వెళ్ళేవాడు.అది గునగునతిరుగుతూ పిట్టలతో ఆడుతుంది. కారులో షికార్లు కొడుతున్నా అని దానికి గర్వంకూడా! పెద్దకుక్క టామీ ఇంటికికాపలా కాసేది.గేటు దగ్గర కాపలాకాస్తూ ఇంటి చుట్టూ తిరిగి మహాజాగ్రత్తగాఉండేది.అర్ధరాత్రి ఆకుటుంబం రాగానే తోకఊపి స్వాగతం పలికేది. అంతా  టామీ టామీ అని దాన్ని నిమురుతూ బిస్కెట్లు బ్రెడ్  దానికి కొంచెం ఎక్కువగా పెట్టేవారు.ఇది చుప్పనాతి పప్పీకి నచ్చని విషయం. "రోజంతా  ఒళ్లు హూనమయ్యేలా వీరివెంట తిరిగి పిల్లలు నన్ను విసిగించినా ఆడాను.ఇంటికి రాగానే టామీని ముద్దు చేస్తారా?"అదీ దాని గుణుపు. ఆరోజు  ఉండబట్టలేక టామీ తోఅంది"నీకు  నాకన్నా  బిస్కెట్లు బ్రెడ్ ఎక్కువపెడతారు.నీవు విశ్రాంతి గా కూచుంటావు." టామీ  నవ్వుతూ అంది"నేను కాసేకుక్క కాపలా నీవల్ల కాదు. చీమ చిటుకన్నా చెవులు నిక్కపొడుచుకొని వింటా.నీవు షోకిల్లాగా కారులోషికార్లు కొడుతావు.రోజంతా  మూలముడుచుకుని కూచుంటావు.నేనుమాత్రం వర్షం  ఎండలో కూడా   ఇంటి చుట్టూ తిరిగి మహాజాగ్రత్తగాఉంటా.నీవు  గుర్రుకొడతావు.నేను పెద్దదాన్ని కదా?కడుపు  నిండాలి కదా?"

అంతే  పప్పీ ఆలోచనలో పడింది. . మనంకూడా గొప్ప పెద్దఇంటిలోఉన్నామని గర్వంపడరాదు.మన వాచ్మన్  అతని కుటుంబం సేవలని గుర్తించాలి.వారి పిల్లలకి చదువులో సాయం చేయాలి.సఫాయిపనివారిని కూడా ఆదరంగా పలకరించాలి.ఈకరోనాకాలంలో వైద్యసిబ్బందితో సమానంగా సేవచేస్తున్నారు.వారు రోడ్లు శుభ్రం చేయకపోతే అంటురోగాలు పెరుగుతాయి.ఎవరి విలువలు వారివి.ఎవరినీ కించపరచకూడదు.