రోహిణి చినుకులు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
రోహిణి చినుకులు రాలగా
బంగారు భూమి తడవగా
తాత పాదు చేశాడు
పొట్ల విత్తులు నాటాడు

చిన్నగా మొలకెత్తాయి
మారాకు వేసి పెరిగింది
తాత పందిరి వేశాడు
పందిరి మీదికి పారింది

పొట్ల చెట్టు పూసింది 
అవ్వ వచ్చి చూసింది 
పసుపు కుంకుమ వేసింది
పూసిన చెట్టుకు మొక్కింది

మూరెడు పిందెలు

వేసింది
బారెడు పొడుగు పెరిగింది
పొట్ల కాయలు తెంపారు
సంచి నిండా నింపారు

సంతలోన అమ్మారు
చేతికి రొక్కం వచ్చింది
సరుకులు కొన్ని కొన్నారు
ఇల్లు చేర వచ్చారు

కామెంట్‌లు