ఎప్పుడు?:-కవిత వేంకటేశ్వర్లు
బడి గంట గణగణ లేదు
జనగణమన గీతం లేదు
ఉరుకులు పరుగులు లేవు
అయ్యా వారి పాఠాలు లేవు

తరగతి నిండా పిల్లలు
లేవు తగవులాటలు
లేవు పిల్లల ఆట పాటలు
లేవు చిళ్ళంగోడ కోతి కొమ్మచ్చి
ఏమి లేక పడుతుంది పిల్లలకు పిచ్చి

చదివింది చంకనాకే
పల్లెల్లో పొలం బాటే
పట్నంలో టి.వి.షోకే
పిల్లలకు ఇష్టం కేకే

కరోనాకు అంతం ఎప్పుడు
చక్కగా బడికి పోయేదెప్పుడు
ఎంచుక్కా చదివేదెప్పుడు
స్నేహితులను కలిసేదెప్పుడు
అందరం కలిసి ఆడేదేప్పుడు
నవ్వుతూకబుర్లు చెప్పేదెప్పుడు
ఎప్పుడు..ఎప్పుడు..ఎప్పుడు?