మాదిరి ..!!:-డా.కె.ఎల్.వి.ప్రసాద్,-హన్మకొండ
కులాంతర
మతాంతర
భాషేతర
ప్రేమ వివాహాలు
అంత ఆషామాషీ కాదు!

ప్రేమ అంకురించినప్పుడు వుండే
భావోద్రేక ఆలోచనలు,
పెళ్లి అయ్యాక,
జీవితాంతం అదే ప్రేమ
అనుభవించగలవాళ్ళు
అదృష్టవంతులు!
ఇలాంటి ప్రేమాజంటలు,
బహు అరుదు సుమా!!

అలాంటి వాళ్ళు...
నిజమైన ప్రేమికులు!
ప్రేమకు..
నిర్భయంగా..
నిర్వచనం ఇవ్వగల
గుండె గట్టిదనం గలవాళ్ళు!
ప్రేమకు మంచి 'మాదిరి'వాళ్ళు!!