విద్య:- సత్యవాణి

 అంగట్లో దొరికే వంగడంకాదు విద్య
తలకు అంటించే విగ్గుకాదు విద్యంటే
పడి మ్రొక్కితే అంటేదీ కాదు విద్యంటే
నూరుగురు కౌరవులకు
లక్ష్యం కుదరలేదు పిట్టకన్నుపై
నలుగురు పాండవులకునూ అబ్బలేదు గురిచూసి
పిట్ట కన్నును గుర్తించడం
అబ్బింది అస్త్ర విద్య అర్జునుడొకనికే
లక్ష్య లక్ష్యం లక్ష్యం
చీకటిలో నోటికి ముద్ద వెళ్ళినప్పుడు
శరాన్ని ఎందుకు సంధించలేనన్న పట్టుదల
కృషి కృషి కృషి
అదే ఆకృషే అర్జునునిఅస్త్రవిద్యలో అజేయుని చేసింది
ఆరితేరిన వానిని చేసింది
మహాశివుని మైమరపింపజేసింది
ముక్కంటిని మగ్దుని చేసింది
పాశుపతం అమ్ములపొదికి తెచ్చిందీ ఆ అస్త్ర విద్యయే
మహాభారత యుధ్ధంలో
కథానాయకుని చేసిందీ
ఆ శస్త్రాస్త్ర విద్యయే 
అవును
కృషిచస్తే సాధించలేని సమస్య లేధు
సాధన వలన పట్టుబడని విద్యాలేదు