మంత్రి యుక్తి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 అవంతి రాజ్యన్నివీరసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని మంత్రి పేరు సుబుద్ది.అవంతిరాజ్యం చిన్నది.
అక్కడికి దూరంలో ఉన్న మహిష్మతి రాజ్యన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతను అవంతి రాజ్యాంపై దాడి చేయాలని వేయి మంది సేనలనుతీసుకుని,కొండలు,నదీ దాటి ప్రయాణించి అవంతి రాజ్యానికి కొద్ది దూరంగా ఉన్న అడవిలో తన సేనలతో చేరి, రెండు రోజుల్లో వచ్చే పౌర్ణమి రోజు యుధ్ధం ప్రారంభించడానికి నిశ్చయించుకుని విడిది చేసాడు.
చంద్రసేనుని ఇద్దరు భటులు మారువేషాల్లో అవంతి రాజ్యంలో గుర్రలపై ప్రవేసించి,అరటిఆకులు అమ్మే వ్యాపారి వద్దకు వచ్చి'మాయింట శుభ కార్యం ఉంది నేటి నుండి మూడురోజులు పాటు రోజూ రెండువేల అరటి ఆకులు కావాలి'అని ఆరోజు రెండు వేల అరటి ఆకులు తీసుకుని ధనం చెల్లించి వెళ్ళిపోయారు.
ఆవిషయం వేగులద్వారా అవంతి రాజు వీరసేనుడికి తెలిసింది. మంత్రి సుబుద్దితో సమావేశం అయ్యడు.'ప్రభు మహిష్మతి వారిసైన్యం వేయిమంది పగలు రాత్రికి కలిపి రోజుకు రెండు వేల అరటి ఆకులు కొనుగోలు చేస్తున్నారు. మూడు రోజులు అంటే పౌర్ణమి రోజు వారు మనపై దాడి చేయబొతున్నారు.మనసైన్యం ఐదువందల మందిమాత్రమే ఉన్నారు కనుక యుధ్ధమే జరగకుండా యుక్తిగా వాళ్ళను భయపెట్టి పారిపోయేలా చేసే పధకం అమలు చేస్తాను. నేను ఈరోజు అరటి ఆకుల వ్యాపారిని కలవబోతున్నాను అని, వెంటనే అరటి ఆకులవ్యాపారినికలసిన మంత్రి సుబుధ్ధి మరుదినం మహిష్మతి సైనికులు అరటి ఆకుల కొరకు వచ్చినప్పుడు ఏంచేయాలో వివరించాడు.
మరుదినం మహిష్మతి భటులు మారువేషాల్లో అరటి ఆకులకోసం వచ్చారు.వారిని చూసిన అంగడి యజమాని 'అయ్యా మన్నించాలి కొద్దిగా ఆలస్యం అవుతుంది కూర్చోండి,ప్రతిరోజు రాజుగారి కోటలోనికి నాలుగు వేల అరటి ఆకులు పంపాలి ముందు ఎప్పటిలా వారికి పంపి అనంతరం మీకు ఇస్తాను'అన్నాడు.
'ప్రతిరోజు నాలుగు వేల అరటిఆకులు మీరాజు గారికి ఎందుకు? ఆయన సైన్యం సంఖ్య ఐదువందలే కథ!మరి ఇన్ని ఆకులు ఎందుకు'అన్నాడు మారువేషంలోని మహిష్మతి సైనికుడు.
'భలే వాడివయ్యనువ్వు మాసైనికబలం రెండు వేలు,పైగా యుధ్ధం అంటూ వస్తే మారాజ్యంలోని యువకులు దాదాపు నాలుగువేలమంది యుధ్ధ శిక్షణ పొంది ఉన్నారు. ఇన్నేళ్ళుగా వారికి అరటి ఆకులు ఇచ్చే నాకు తెలియదా?మహిష్మతి రాజు ఎవరిపైనో దాడి చేయడానికి రాజ్యం వదలి వెళ్ళి ఉన్నాడట రేపు మా రాజు మహిష్మతిపై దాడి చేయడానికి వెళుతున్నారట,రేపటినుండి మళ్ళికబురు పెట్టేదాక అరటి ఆకులు పంప వద్దన్నారు'అన్నాడు.ఇంతలో వాహనం రావడం దాట్లో పనివేళ్ళు నాలుగువేలఅరటిఆకులు పెట్టిపంపించారు.
అరటి ఆకుల అంగడి వద్ద దండోరా వేస్తూ వచ్చిన వ్యక్తి 'ఇందుమూలంగా అందరికి తెలియజేయడమేమనగా మనరాజుగారు మహిష్మతి రాజ్యంపై దాడి చేయడానికి రేపు రాత్రి రెండువేలమంది సైనికులతో బయలుదేరుతున్నారు కనుక రాజ్యంలోని యుధ్ధశిక్షణ పొందిన యువకులంతా మన రాజ్యరక్షణ కొరకు తమ ఆయుధాలతో సంసిధ్ధులై వేలమంది యువకులు రాజు గారు తిరిగి వచ్చేవరకు రాజ్య రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలహో'అని చాటింపు వేస్తూ వేస్తూ వెళ్ళి పోయాడు.
నాలుగువేల అరటి ఆకులు తమ కళ్ళముందే అవంతి రాజభటులకొరకు అరటి ఆకులు పంపడం, పైగా తాము రాజ్యంమహిష్మతిపై దాడికి వారి ప్రయత్నాలు చూసిన మహిష్మతి భటులు,అరటి ఆకులు తో అడవిచేరి తమరాజు గారికి తమకళ్ళముందు జరిగిన విషయాన్ని అంతా వివరించారు.
'అంటే మన వేగులు మనకి అవంతి సైన్యంపై తప్పుడు సమాచారం అందించారన్నమాట, అవంతి సైన్యాలకన్నా ముందుగా మనం మనరాజ్యానికి బయలు దేరాలి' అన్నాడు మహిష్మతి రాజు.
మరుదినం మంత్రి సుబుద్దిని కలసిన రాజు'మంత్రి వర్యా బాగుంది మీ అరటి ఆకుల లెక్క'అన్నాడు.'ప్రభు ఆపదలో తడబడకుండా ఆలోచించి యుక్తిగా ఆపదలను దాటవచ్చు మనం సైనిక బలం పెంచవలసిన సమయం ఆసన్నమైయింది'అన్నాడు మంత్రి.