త్రిపదలు:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 గురువు.........
జ్ఞానమిచ్చే కామధేనువు
మోక్షమిచ్చే దైవము

తప్పు...........
చేసినవాడు దోషి
తప్పించుకున్నవాడు నిర్దోషి

రైతు.......
భూమికి రాజు
భుక్తికి తరాజు

అమ్మ.........
కనిపించే దైవం
కనుమరుగైనా దైవమే

స్త్రీ.....
తెలుసుకుంటే శక్తి
అర్థం కాకపోతే సూక్తి

వయస్సు
వదిలేస్తే గోదారి
బిగిస్తే రాదారి