*ఉగ్రనాదమా!* *హృదయనాదమా!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 *ఉగ్రవాద వ్యతిరేక* *దినోత్సవం*
--------------------------------------
1.ఉగ్రవాదం/తీవ్రవాదం!
   అది ఏదయినా!
  అదో విషాదనాదమే!
  వారంతా ఉన్మత్తవాదులు!
  విచక్షణాజ్ఞానరహితులు!
  ఉదయిస్తే సహజంగా,
    అస్తమించనిది ఉగ్రవాదం!
2.ఉగ్రవాదులఉగ్రరూపసాక్ష్యం,
క్రియాశీలప్రధానిఇందిరాగాంధీ,
                          దుర్మరణం!
 ఆత్మాహుతికి ఆహుతి,
 సౌమ్యప్రధాని  రాజీవ్ గాంధీ!
విరుచుకు పడటం వారి నైజం!
ఇది చరిత్ర చెపుతున్న నిజం!
3.ఎన్నాళ్ళు ఇలా?
 పాముతిరిగే ఇంట ఉంటామా!
ఉగ్రవాదఉన్మాదానజీవనమా! 
  యువత భవిష్యత్తు తాకట్టు!
 జాతి సౌభాగ్యం గొడ్డలిపెట్టు!
4.ఉగ్రనాదాలు కాదు!
   హృదయనాదాలు వినాలి!
   ప్రపంచాన్ని ఏకం చేసేది,
  టెర్రరిజం కాదు, టూరిజం!
5.ప్రపంచమంతా ఒక్కటై!
   ఉగ్రవాదం పై ఉక్కుపాదం!
   ఉగ్రవాద నిర్మూలనం!
      ఉత్తమసమాజస్థాపనం!
 ప్రపంచ శాంతి ఉద్దీపనం!