వర్షాకాలం' గేయం-మద్దినేని జ్యోతి-ఖమ్మం

 వర్షా కాలం వచ్చింది 
వసుధకు అందం పెంచింది
వన్నెల మొలకలు మొలిచాయి 
అవనికి వెలుగులు పంచాయి
పచ్చని చీరను కట్టాయి
వనాలు బహు పసందుగా మురిసాయి
పువ్వుల నవ్వులు విరిసాయి
 పుడమిని మెత్తగా తాకాయి