అక్షరమే ఆయుధం:-పిల్లి.హజరత్తయ్య
స్త్రీలపై అకృత్యాలకు పాల్పడుతున్న
కామాంధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా
అక్షరమునే ఆయుధంగా మలచి
స్త్రీలకు స్వాంతన చేకూర్చుదాం..!

ఆరుగాలం కష్టపడి పండించిన
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న
రైతన్నల కన్నీటి గాథలను
అక్షరాలతో తర్పణం గావిద్దాం..!

కష్టాలకోర్చి డిగ్రీలు అందుకున్న
ఉపాధి దొరకక అల్లాడుతున్న 
యువత చేసే ఆర్తనాదాలను
అక్షరాలతో ప్రభుత్వాల చెవికెక్కిద్దాం..!

రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా
నాలుగేళ్ల నోట్లోకి వెళ్ళని
పేదరికపు పురిటి నొప్పులను
అక్షరమనే అగ్నికణంతో ప్రశ్నిద్ధాం..!

కరోనాతో కుదేలైన అభాగ్యుల కుటుంబాలలోని నిరాశ నిస్పృహలను
మనోధైర్యమనే మందుతో పారద్రోలి
అక్షరాలతో సవాళ్లను ఛేదిద్దాం..!