మనకు ఏది అవసరం ఎంత అవసరం?:-రవీంద్ర బాబు కొమ్మూరి
మనం షాపింగ్ మాల్ కి వెళ్తాం ఎన్నో కొంటాం అవసరమని...
 కానీ అందులో నిజంగా అవసరమైనవి ఎన్ని?
 మన తాహతుకు మించినవి ఎన్ని?
ఎప్పటికో పనికొచ్చేవి ఎన్ని?

మనము భోజనం చేయడానికి హోటల్ కి వెళతాం ఎన్నో ఐటమ్స్ తింటాం...
అవి సరదాగా తినడానికి వెళ్తామా?
 ఇంట్లో చేసుకోలేక తినటానికి వెళ్తామా?
 తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తామా?

కొంతమంది చాలా ఎక్కువ సార్లు సినిమాకి వెళ్తారు....
 వినోదం కోసం వెళ్తున్నారా?
 టైం పాస్ కోసం వెళ్తున్నామా?
 డబ్బుల విలువ తెలియక వెళ్తున్నారా?

మరి కొందరు జిమ్ లకు పబ్బు లకు అలవాటు పడుతున్నారు....
ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడానికి వెళ్తున్నారా? పదిమందిలో గుర్తింపు కోసం వెళ్తున్నారా?
 శారీరక శ్రమ విలువ తెలియక  ఉన్న డబ్బును ఖర్చు పెడుతున్నారా?

ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిస్థితులను మననం చేసుకుంటూ....