వసంతం(అక్షరమాలికలు)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:
*******
1.ప్రకృతి పచ్చతొడుగు కప్పుకొని...
కొత్తగా కనబడితే అదే వసంతం!
2.గండుకోయిలలు కమ్మని రాగాలు....
మావికొమ్మల నుండి ఆలపిస్తే ఆమని‌ రాకయే!
ద్విపది:
*******
1.ప్రకృతికి కొత్తశోభ వచ్చింది.
నూతనత్వంతో లోకం మురిసింది.
2.పండుగలు ముచ్చట గొల్పుతాయి.
పెళ్ళిళ్ళు,వేడుకలతో సందడిగా వుంటుంది.
త్రిపది:
******
1.ఆవకాయ ఘుమఘుమలు కట్టిపడేస్తాయి.
సెలవులు వచ్చి పిల్లలు ఆటపాటల్లో మునిగితేలుతారు.
కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు.
2.పట్టణాలు ఖాళీ అయ్యి,పల్లెలకు అందరూ ప్రయాణాలు చేస్తారు.
ప్రకృతి ఒడిలో సేదతీరి మురుస్తారు.
అందరొక్కటై ఆనందంగా గడుపుతారు.