షాడోలు -(క్రీనీడలు ) ఏటి ఒడ్డున ఇల్లు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఏటొడ్డు ఇళ్లు 
బాటలో బళ్ళు 
చెరువున నీళ్లు 
ఆనందమే పల్లెలు ఉమా!

సన్నగా బాట  
బండోడి పాట 
బాతులీ పూట 
కాల్వనీదెను హాయిగ ఉమా!

పేరేదొ  చెట్లు 
రంగులై చుట్లు 
కళ్ళు మిరు మిట్లు 
ఆహ్లాదమె  మాపల్లె ఉమా!

చిరుగాలి పాట 
చిలకమ్మ ఆట 
తొలి సంజె పూట 
రవళించుచున్నది కదా ఉమా!

పెరటిలో అరటి 
కోళ్లగూడోటి 
వంటకి పడమటి 
ఇల్లుందిలే చక్కగ ఉమా!