కన్నీళ్లను మింగిన అక్షరాలు
వేదనలను బాధలను కవిత్వమై స్రవించి దరిద్రనారాయణుల జీవితాల గుండెల మంటలు ఎఱ్ఱ చందస్సై ఎగిసిపడ్డాయి
నిరసనలు హర్తాళ్లతో అట్టుడిగే కార్మిక లోక కళ్యాణానికి దన్నుగ నిలిచి
శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టిన
నవాబు
నేను సైతం అంటూ ప్రపంచపు నడకలోని లొసుగుల మీద శరసంధానం చేసిన అక్షర గాండీవం
హెచ్చు తగ్గులన్నింటిని
ఏకి పారేసి దళారుల మోసాలను దగాపడ్డ తమ్ముళ్ల కన్నీళ్లు తుడిచి జగన్నాథ రథ చక్రాల గతిని శృతి చేసి
వినిపించిన వీరుడు
అతడొక మహాశక్తీ
పదాలకు ఇనుప తొడుగులు
వాక్యాల్లో పిడుగులు కూర్చి
అకృత్యాల మీద విరుచుకు పడ్డ
వైప్లవ్యగీతం
మరోప్రపoచo తలుపులు తెరిచి కాదేదీ కవిత్వానికి అనర్హమంటూ
గుండె చెరువులైన
ఆవేదనలను దారి మళ్లించి
ఇరువదవ శతాతాబ్ది సాహితీ పథాన్ని మార్చిన
వైతాళికా..ఎత్తిన పతాక
ఆగడం కాదు సాగడం
ఆవేశం కాదు అడుగువేయటం
సహవాసం కాదు సాలోచనతో
నడవoడoటూ శంఖం పూరించిన శ్రీ శ్రీ తానొక అక్షర పాంచజన్యం
నిర్భాగ్యుల అభాగ్యుల మీద దయాసముద్రమై కురిసాడు నూతన శబ్ద ప్రయోగమై ఆలోచన హవిస్సులతో అక్షర యజ్ఞం చేసిన ఆధునిక సోమయాజి
కవిత్వం అంతా ప్రయోగం
ప్రజోపయోగం చేసి జీవితాన్ని ధారవొసి కొత్త నడకలు నేర్పిన
క్రాంతదర్శి..కవితాలోకపు తలస్పర్శి
సినీగీతమై కలం ఝళిపించిన
కవన సంగీతమై నిప్పులు కురిపించిన
అభ్యుదయ పథగామి..
అంతరిక్షంలో ప్రకాశించే
అర్కుడు..
మన ప్రశ్నల్ని మోసి
నింగిని నిల్చిన విక్రమార్కుడు
( మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి