పండ్ల రసాలు -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
పండ్లరసం త్రాగుదాము 
ఇండ్ల లోనే చేద్దాము 
అరటిపండు పెరుగు కలిపి 
లస్సీగా త్రాగుదాము !

చవకగాను తయారీలు 
ఆరోగ్యముకు రక్షణ 
టమాటోలు ఉసిరి కూడ
రసం ఇచ్చు సి విటమిను !

సీసాల్లో సరుకులోను 
రసాయనo కలిసి

ఉంది 
రుచి వాసన కృత్రిమంగా 
నిల్వచేయబడ్తూ ఉంది!

అసలైన పండ్లరసం 
తాజా రుచి విలువలుండు 
ఆరోగ్యము ఆర్ధికంగా 
మనకు మేలు కలుగుతుంది!