ప్రకృతి బంధం(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

 పున్నమి చందమామకు చుక్క
                అందం
పొడిచే పొద్దుకు సింధూరం
           అందం
బుద్దిగల భూదేవికి పచ్చదనం
             అందం
భూతల్లి బిడ్డకు మమకారం
             అందం
పున్నమి జాబిలికి అలలతో
          అనుబంధం
ఉదయ సింధూరానికి పక్షులతో
           అనుబంధం
అవణి తల్లి పచ్చదనం ప్రకృతితో
            అనుబంధం
బువిపై జీవకోటికి వీటన్నింటి తో
            అనుబంధం
అనుబంధ బంధాలన్ని అన్నింటికి
       అందమైన బంధం
ఒకదానికొకటి తోడుగా ఆత్మ బంధాలు