అంతా ఒకటే (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
చిన్నారి బాబు ను చూసారా
శివ నామము పలుకుతూ
శివుని చరిత్రను విప్పాడు
చిత్తము నందు నిలిపాడు

అందాల బాబు ను చూసారా 
హరినామము పలుకుతూ
అందరి ముందు నిలిచాడు
హరి హర భజన చేశాడు

ముద్దుల బాబు ను చూసారా
శివుడు అతడే హరి అతడే
అల్లా అతడే యేసు అతడే
భక్తితో మీరు కొలవండి

పెద్దలు అందురు వచ్చారు
మత భేదాలు మరిచారు
చేయి చేయి కలిపారు
ఐక్యమత్యముతో నిలిచారు