వృద్ధాప్యం:-పిల్లి.హజరత్తయ్య సింగరాయకొండజిల్లా: ప్రకాశం
91) మనిషి జన్మ చిత్రమైనది
మనిషి ప్రవర్తన విచిత్రమైనది
పుట్టుక ఆనందము నిచ్చును
మరణం దుఃఖమును మిగుల్చును

92) మనిషి బాల్యం ఉదయము
మనిషి యవ్వనం మధ్యాహ్నము
మనిషి వృద్ధాప్యం సాయంత్రము
మనిషి మరణం చీకటిమయము

93) బాల్య ఆనందంగా గడిచును
వృద్ధాప్యం బాధాకరంగా నడుచును
జీవితంలో వెలుగు కొందరికి
జీవితంలో చీకటి మరికొందరికి

94) వృద్ధాప్యంలో దేహం రిపేరొస్తుంది
శరీరంలో నిస్సత్తువ ఆవహిస్తుంది
కొందరికి పంటి సమస్యలు
మరికొందరికి కంటి సమస్యలు

95) కొందరు వేగంగా వెళ్తారు
ఇంకొందరు నిదానంగా నడుస్తారు
చేరే గమ్యం ఒకటే
చేరే మట్టి ఒకటే

96) వృద్ధాప్యంలో ఆనందం ఆవిరవుతుంది
శేషజీవితం విషాదంతో ముగుస్తుంది
వృద్ధాప్యంలో ఆలోచనలు పెరుగుతాయి
జబ్బులు బాగా దొర్లుతాయి

97) కొందరికి శక్తి నశిస్తుంది
మరికొందరికి ఆలోచన సన్నగిల్లుతుంది
కొందరిలో చేదస్తం పెరుగును
ఇంకొందరిలో ఒత్తిడి అధికమగును

98) కొందరు అచేతనంగా పడిఉంటారు
చాలామంది ఇంటికే పరిమితమవుతారు
ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది
వయసు భారం హెచ్చుమీరుతుంది

99) వృద్ధులను నిర్లక్ష్యంగా చూడరాదు
వృద్ధులను భారంగా భావించరాదు
వారిని పిల్లల్లా చూసుకోవాలి
వారి కోర్కెలను తీర్చాలి

100) మందులు ఉచితంగా అందజేయాలి
వృద్ధాశ్రమాలు ప్రభుత్వాలు నెలకొల్పాలి
దైవచింతన మనశ్శాంతిని అందిస్తుంది
వృద్ధులకు మరణం సిద్ధిస్తుంది

కామెంట్‌లు