*వారసులు*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలలండి బాలలు
భరతమాత ఆశలు
చైతన్యమె ఊపిరై
సాగునట్టి బాలలు
సమాజాన చీకట్లను
పారద్రోలు దీప్తులు
చిరునవ్వులు చిందించే
శరత్కాల చంద్రులు
భావిభారత పౌరులు
భరతమాత వారసులు !!