వీళ్ళేనయం ..!! (చిత్ర కవిత):---డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మకొండ..

 అడవిలోఉంటేనేమి ?
ఆకులమాస్కు -
కట్టుకుంటేనేమి ?
నిరక్షరాస్యులైతేనేమి ?
నిలువనీడలేకుంటేనేమి ?
ఇంకా కళ్ళుతెరవని ,-
అక్షరాస్యులకంటే ,
నవనాగరికతను -
ఒళ్లంతా ఆధునికత్వాన్ని ,
నిండుగా  కప్పుకున్నవారికంటే ,
వీళ్ళేనయం ....!
ప్రజల్ని అప్రమత్తంచేసే ,
వీరిసందేశాత్మక --
సాధారాణ ,
ఆహార్యమే నయం ...!!
         -