సడలింపు:--డా.. కందేపి రాణీప్రసాద్.
పొద్దు పొడిచిన పొద్దు గుంకినా
తేడా ఏమి లేదు
బొరియల్లో దూరిన కుందేళ్ళలా
కలుగుల్లో దాక్కున్న ఎలుకల్లా
తొర్రల్లో దాగిన పక్షుల్లా
మాస్కుల్లో మొహాలు దాచుకోవడమే
తలుపులు గోల్లాలు పెట్టి లోపలుండడమే

రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల సడలింపులతో
పంజరాల నుండి
బయటపడ్డ పావురాల్లా
జైళ్ళ నుండి
విడుదలైన ఖైదీల్లా
పుట్ట నుంచి
వెలుపలి కొచ్చిన చీమల్లా
రోడ్డంతా మనుషులే 

బెరుగ్గా కొందరు
బెదురుతో కొందరు
ఏమైనా పర్లేదన్న
ధీమాతో మరికొందరు

ఇప్పుడు
కళ్ళలో భయం ప్లస్ ఆనందం
కాళ్ళలో వణుకు ప్లస్ గమనం
ఒంట్లో ఉద్వేగం ప్లస్ ఉత్సాహం
కానీ
ఇండియా మైనస్ కరోనా ఎప్పుడు