" హితవు "(బాలగేయం):--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు.
చక్కని దారిల్లో
చుక్కలా వెలిగిపో!
మిక్కిలి వినయంతో
మొక్కలా ఎదిగిపో!

సత్యాన్ని ప్రేమించి
ముత్యములా మారిపో!
నిత్యము  శ్రమయిస్తే
తధ్యమే ఫలితంబు

మరుమల్లె రీతిలో
చిరునవ్వు చిందించు!
తరువుల త్యాగముతో
ధరణిలో రాణించు!

ఉపకార బుద్ధితో
సహకారమందించు!
అపకారమెన్నడూ!!
అసలు తలపెట్టకు