అందాల మొలకను...:-మొహమ్మద్. అఫ్సర వలీషా ద్వారపూడి( తూ గో జి )

 ఆడపిల్లను అయినా
 ఆత్మ విశ్వాసపు పునాదిని
ఆటపాటలతో అలరించే ఆనందాన్ని  
అఆలు  ఆంగ్ల పదాలు  
అలవోకగా ఉర్దూ కలిపి చదివే పదాన్ని 
అందమైన కుటుంబంలో 
అరవిరిసిన కుసుమాన్ని
అలలతో ఉప్పొంగే ఉత్సాహపు కెరటాన్ని
ఆదర్శాల పూబంతిని
అమ్మా నాన్నలకు మాటిస్తున్న
ఆకాశమంత ఎదుగుతానని
అన్నింటిలో నేనే రాణిని మహారాణిని
అమ్మమ్మ తాతయ్యల 
అల్లారు ముద్దుని
అందాల బాబాయ్ మామయ్యల 
గారాల పట్టిని
అడుగడుగునా మడుగు లొత్తే 
నానమ్మ తాతయ్యల అనురాగాన్ని
అనుక్షణం అందలమెత్తే  
పిన్ని పెద్దమ్మల ఆప్యాయతను
అందరి పెదాల ముద్దుల చిరునవ్వుని
ఆర్మీలో చేరి పోలీస్ డాక్టర్ నవుతాను
ఆకతాయిల భరతం పట్టేస్తాను
అఫ్షా ను నేను
అందరి ఆశీస్సులు కావాలని
ఆశ పడుతున్నాను...!!