అక్షరమాలికలు--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
ఏకపది: (సంగీతం)
*******
సరిగమల సుస్వర సాధనతో...
సుమధుర శ్రవణ సౌభాగ్యం!

ద్విపది: (సాహిత్యం)
*******
హితాన్ని బోధించి, గ్రంథస్థమవుతుంది.
భావితరాలకు దిక్సూచై,చరిత్రవుతుంది.

త్రిపది:(స్నేహితుడు)
******
మనసు తెలుసుకొని మసలుకొని
తోడూ-నీడై వెంట నడుస్తాడు.
మంచిని చెప్పి,అభివృద్ధికి తోడ్పడుతాడు.