విశ్వాసమే అసలైన వైద్యం డా.. కందేపి రాణీప్రసాద్.
చేతులు కలపవద్దంటున్నారు
చేతులు కడగమంటున్నారు
మాటి మాటికి కడిగి కడిగి
శానిటైజర్లు పూసిపూసి
ఏది ముట్టుకోవచ్చు
ఏది అంటుకోకూడదు
అయోమయ మానసిక స్థితిలో
త్రివమైన ఒత్తిడిలో
ప్రజలు మునిగితేలుతున్నారు?

టివీలో కరోనా కథనాలు చూసి
పేపర్లలో కరోనా వార్తలు చదివి
పాలప్యాకేట్లతో వస్తుందో...
కరెన్సీ నోట్లతో వస్తుందో...
ఒకవేళ వస్తే ఏమవుతుందో?
మరణం తప్పదా
మరణించినా...
చివరి వీడ్కోలు విషమమౌతుందా!
ఎన్నో తికమకలు, ఆందోళనలతో
తీవ్ర మానసిక వేదనలు

ఆఫీసులకు పోవడం లేదు!
స్కూళ్ళు నడవడం లేదు!
కాలు బయట పెట్టట్లేదు!
కరోనా ఎప్పుడు చస్తుంది?
లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు!
అప్పటికి సాధారణ జీవితం!
లాక్ డౌన్ తీసేస్తే
ఎవర్నైనా ఇంటికి రానివ్వచ్చా?
సినిమాలకు షికార్లకు వెళ్ళొచ్చా
లేక కరోనా మళ్ళి విజ్రుంభిస్తుందా?
మెదడులో పేలుతున్న
సమాధానం లేని ప్రశ్నలు
ఉద్వేగ పూరిత ఆలోచనలు
గుండెల్లో గుబులు, బెంగలతో
యన్జ్యేటి, డిప్రెషన్లు!

అంటురోగం కన్నా అతి భయమే
అసలైన ప్రమాదం
ఆదైర్యం కన్నా ఆత్మవిశ్వాసమే
అసలైన వైద్యం!