*నిర్భయానికి,**నిలువెత్తు రూపం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.ఇంటిపేరు టంగుటూరి!
   ఇలకే తరగని వ్యక్తిత్వసిరి!
*ఆంధ్రకేసరి కి సరి కేసరి,*
                 *దొరకదు మరి!*
ఆంధ్రా కే కాదు ఆపేరు,
ఆయన,భరతమాత గళాన ,
   తళతళలాడే కాసుల పేరు!
2.దూసుకెళ్ళే తుపాకి గుండు,
  ఆ గుండె తాకలేక,
  గుటకలుమింగి ,
             వెనకడుగేసింది!
ఉద్యమాన ముందున్న గుండె,
ఉద్యమానికి అలుపేలేని అండ.
3.ఆదాయం తృణప్రాయంగా,
                     ఎంచినోడు,
   ఉద్యమభాగస్వామ్యమే,
        సర్వస్వం అనుకున్నాడు!
   పదవిపెదవికై వెంపర్లాడక,
   దిగిపోయిన, అసలైన,
    అరుదైన నాయకశిరోమణి!
4.కృష్ణానదిలా ఉరకలేసినోడు
*ప్రకాశంబ్యారేజి* గా,
               నిలిచి ఉన్నాడు!
  అందుకుంటున్నాడు,
         నిత్యం జననమస్కారం!
   ఆ ఘనకీర్తి,
                  ఆచంద్రతారార్కం!
5.ఆ ప్రకాశం!
        స్వయం ప్రకాశం!
         అమేయప్రభావం!
         జనతమ వినాశనం!
     సర్వహృదయసమ్మోహనం!