ఆరవ భూతం (కథ):-ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)

 భూమిపై ఒక విచిత్రం జరిగింది.
పంచభూతాలు జీవాన్ని సృష్టించాయి కానీ మనిషిని సృష్టించాయనీ అంటుంటారు. మనిషి సృష్టించబడలేదు అది ఒక ప్రయాణం జీవ ప్రయాణం జీవ పరిణామం అంతే.
మనిషి కూడా ఒక ఆరవ భూతం. చిత్రమేమిటంటే పంచభూతాలు ఆరో భూతం మనిషి మంచి మిత్రులు ప్రేమికులు. పంచభూతాలు వయసులో కొచ్చిన ఆడవాళ్ళు వాళ్ళ తోటి వాడు ఆరో భూతం మనిషి మాత్రం మగవాడు. మనిషి అదే ఆరవ భూతము తోటి వాళ్లను అంటే పంచభూతాలను ప్రేమించాడు కానీ పంచభూతాలు ప్రతిభావంతులు మహిమాన్వితులు లోక కల్యాణం కోసం ఉద్భవించిన వాళ్లు కావడం వలన విశ్వం వాళ్లకు మరో అవకాశం ఇచ్చింది వాళ్లందరి పెళ్లిళ్లు జరిగిపోయాయి.

పిల్లలు కూడా పుట్టారు కానీ ఆరో భూతం మనిషి మాత్రం పంచభూతాల ముందు తలవంచుకుని నిలబడ్డాడు. ఎందుకంటే మనిషికి అంత శక్తి సామర్థ్యాలు కానీ ప్రతిభాపాటవాలు కానీ లేవు మహిమాన్వితుడు అంతకన్నా కాడు కనుక విశ్వం అతని కోసం ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదు పాపం మనిషి ఒంటరి వాడయ్యాడు.
మనిషి ఫైర్ కు అవమానాన్ని తట్టుకోలేక పంచభూతాల్లో కలిసిపోవాలి అనుకున్నాడు. విశ్వం విస్తుపోయింది.
మనిషి లోక కల్యాణం కోసం పుట్టి ఉంటే కళ్యాణం జరిగి ఉండేది కానీ కళ్యాణం జరగలేదంటే లోకకల్యాణం కూడా జరగదు. కనుక విశ్వం పంచభూతాలను సమావేశపరిచి ,మీ కల్యాణం జరిగే పాతికేళ్ల అయింది కదా మీకు కలిగిన కన్యలను ఆరవ భూతమైన మీ మిత్రుడు మనిషి పిచ్చి పెళ్లి జరిపించండి .ఇది లోక కల్యాణం కోసం మాత్రమే అని సూచిస్తుంది విశ్వం. పంచభూతాలు ఒక్కసారి నిశ్చేష్టులై నిజమే మే మా మిత్రుడు మనిషి వెనుకబడి పోయాడు. ఆ విషయాన్ని మర్చిపోయాం అతనికి ఇంకా పెళ్లి కాలేదు.
లోక కల్యాణం కోసం మనం మన కూతురునిచ్చి పెళ్లి జరిపించాల్సీన అవసరం పవిత్రమైనదని భావిస్తారు పంచభూతాలు. కానీ కానీ అతను కూడా మాలాగా ప్రతిభావంతుడు మహిమాన్వితుడు కావాలి కదా.!? అందుకని అతనికి అతని వయసు కన్నా నా ఆశయం ముఖ్యమని భావించి పంచభూతాలు అతన్ని కలిసి, నీవు పంచభూతాలు నుంచి  కన్యను ఆశించాలి అంటే నీకు ఎంత సామర్థ్యం ఉందో నిరూపించుకోవాలి మీ వయసు తో పని లేదు. నీవు మా అవసరం అనుమతి  లేకుండానే విశ్వంలో ఇంకెక్కడైనా వెళ్లి ఒక ఆడపిల్లను చూసి రమ్మని చెపుతారు.

అది మొదలు మనిషి బ్రహ్మచారిగానే ఉంటూ చంద్రమండలానికి వెళ్లి చందమామతో స్నేహం చేస్తాడు. వెన్నెలను ముద్దాడి కౌగిలించుకొని తిరిగివస్తాడు. ఇప్పుడు బంగారం లాంటి అంగారక గ్రహాన్ని చేరుకుని ఆ కన్యను ముద్దాడి తిరుగు ప్రయాణం లో ఉన్నాడు మనిషి.

ఇక్కడ పంచభూతాలు తమ కూతుళ్లను ఆరో భూతం మనిషికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్వం ఆశ్చర్యపోయింది.
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273