పద్యాలు : - బెజగాం శ్రీజ , గుఱ్ఱాలగొంది


 1ఆ.వె.
నర్సులుండమనకు నయమౌను రోగాలు
సాటి జనుల కిలన సాయపడును
సూది మందు లిచ్చి శుభ్రంగ సేవలు
ధరణిలోనజేయు దండిగాను
2ఆ.వె.
ఆపదొస్తెచాలు అలసటలేకుండ 
రోగి సేవజేయు రూఢిగాను
రాత్రి పగలుయనక రక్షణే ధ్యేయమై 
కష్టపడును నర్సు యిష్టముగను