సామాన్యుని‌ అస్త్రం(చట్టం)-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 నిబంధనలు,సూత్రాలు,అధికారాలు,శిక్షలు,అవగాహనలు రూపొందించి
తయారుచేస్తారు చట్టాలు
ప్రజాస్వామ్యానికి చేయూతనిచ్చి
సామాన్యుడికి అండగా నిలుస్తుంది
మేధావులు,న్యాయకోవిదుల
అనన్యసామాన్యమైన జ్ఞానం
పరిశీలన,పరిశోధనల అనంతరం
రూపుదిద్దుకున్న చట్టం మహనీయం
న్యాయవాదులు,న్యాయమూర్తులు
నిత్యం సాధన చేస్తారు
చట్టానికి లోబడే కర్తవ్యాలుంటాయి
న్యాయదేవత నిండైన మూర్తిమత్వంలో 
చట్టం పరిరక్షించబడుతుంది
చట్టానికి ఎవరూ చుట్టాలు కారు
చట్టం ముందు అందరూ ఒక్కటే
కాలానుగుణంగా చట్టాలు మారాలి
చట్టాలలోని‌ లోపాలు శాపాలుగా మారి
కొందరి పాలిట వరాలవుతున్నాయి 
చిక్కినట్టే చిక్కి జారిపోతున్న వారెందరో
చట్టఖడ్గానికి పదునెక్కువుండాలి
చట్టాన్ని కాపాడడానికి అందరూ పూనుకోవాలి
సత్వర న్యాయమే దాని లక్ష్యం కావాలి
చట్టసభల్లో చేసే తీర్మానాలు
సామాన్యులకు రక్షణకవచాలు కావాలి.