పుస్తక వైభవం:---కళావతి కందగట్ల-హైదరాబాద్
విశ్వమంతా వింత పోకడలు
సంస్కృతి సంప్రదాయాలకు
నీల్లోదిలి...
చూసి నేర్చుకునేదే అంతా
చదివి ఆకలింపు చేసుకునేది
ఎక్కడ....?

అక్షరాలను కలుపుకుంటూ 
పదాలను పేర్చుకుంటూ
కాగితం పై ఆర్తిగా అద్దుకుంటూ
విజ్ఞానపు రాసులను
తన పొత్తిళ్ళలో అందించిన
పుస్తక భండాగారాలది ఎంత
ఘనమైన చరిత్ర....

ఎందరికి 
జీవిత పాఠాలు నేర్పిందో
పుస్తక పఠనం...
మరెందరిని
మహా కవులుగా తీర్చిదిద్దిందో
ఎందరెందరికి
స్ఫూర్తి కలిగించిందో
హస్త భూషణం....

చరవాణి మాయలో
కనుమరుగై
వాడిన వసంతం లా
వెలవెల బోతున్న అక్షర పొత్తాలను
పఠనాసక్తి జల్లులతో తిరిగి
పుస్తక వైభవాన్ని తీసుకొద్దాం...

ఘనమైన గతచరిత్ర
గ్రంధాలు....
శాతాబ్దాల వారసత్వ
చిరునామాలను...
భావితరాలకు అందించాలంటే...
చెదలు పట్టబోతున్న
అక్షర సంపద ఆనవాళ్ళను 
కాపాడుకోవడమే
మన తక్షణ కర్తవ్యం....