ఒక కాకి ఎక్కడ నుంచో పాయసం తెచ్చుకుంది.
చెట్టు మీద కూర్చోని తింటుంది.
కుక్క, కోడి చూశాయి.
పెట్టమని అడిగాయి.
కాని కొంచెం కూడా పెట్టకుండా ఊరించుకుంటూ తిన్నది.
కుక్క కోడి గుటకలు వేస్తూ వెళ్ళాయి.
కుక్క పాయసం కోసం ఊరంతా వెదికింది.
ఎవరింట్లోనైనా ఉంటే దొంగతనంగా తినాలని దాని ఆశ.
ఎంత వెదికిన దొరకలేదు.
తోక ముడుచుకుని తిరుగుతూ ఉంది.
కోడి చేలోకెళ్ళింది.
వరి కంకులు, పెసర కాయలు తెచ్చుకుంది.
దంచింది.
బియ్యం, పెసలు చేసింది.
ఆవునడగి పాలు తెచ్చుకుంది.
చెరకు తోటకెళ్ళి చెరుకు గడలు తెచ్చుకుంది.
రసం తీసి బెల్లం తయారు చేసుకుంది.
యాలుకులు, జీడిపప్పు, కొట్లో కొనుకుంది.
కొబ్బరి చెట్టెక్కి కొబ్బరి కాయల తెచ్చుకుంది.
పగలగొట్టి ముక్కలు చేసి పెట్టుకుంది.
కవ్వానికంటుకున్న వెన్న తెచ్చుకుంది.
కరగబెట్టుకొని నెయ్యి చేసుకుంది.
చెరువులోని నీరు తెచ్చింది.
ఎసర పెట్టుకుంది.
మరిగే నీళ్ళలో అన్నీ వేసింది.
కమ్మని పాయసం తయారయింది.
పెసలతో పప్పు వండుకుంది.
తామరాకు ముందేసుకుంది.
మట్టసంగా కూర్చుంది.
కావలసినంత వడ్డించుకుంది.
పెసరపప్పువేసుకుంది.
అందులో నెయ్యి కలుపుకుంది.
కడుపునిండా తిన్నది.
కుక్క ఇంకా ఇల్లిల్లు తిరుగుతూనే ఉంది.
ఆశ ఉంటే సాధించటానికి ప్రయత్నం చేయాలికాని, తేరగా దొరుకుతుందని తిరగటం వ్యర్థం అని కోడిని చూసి కుక్క తెలుసుకుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి