పూలు (బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు
పూల మొక్కలు నాటాను
రోజూ నీళ్ళు పోశాను
ఆకులు వేస్తే చూశాను
మొగ్గలు తొడగ మురిసాను

నన్ను చూసి ఊగింది 
కొమ్మల చేతులు సాచింది 
పూల పరిమళం పంచింది
పూలను కొన్ని ఇచ్చింది 

దేవుని పూజలో మెరిసింది 
అమ్మ కొప్పులో చేరింది
అక్క జడలో నిలిచింది
చిరు చిరు నవ్వులు రాల్చింది