చిన్న చూపు. కథ. అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రకృతిలో  ప్రతి ప్రాణీ సమానమే.దైవం అలా వాటికి విధులు నిర్ణయించాడు.మనిషి మాత్రమే ఈభేదభావంతో ఉంటాడు. ఎవరి శక్తి యుక్తులను బట్టి బలంని చూసి  వారిని మాత్రమే గౌరవిస్తు బలహీనులను తక్కువగా చూడరాదు.ఇదిమనం జంతువులను చూసి నేర్చుకోవాలి. మరీఆకలి వేస్తేనే అవి చంపుతాయి.కలసికట్టుగా  తమజాతితోకలసి తిరుగుతాయి. ఒకసారి సింహరాజు సభ ఏర్పాటు చేసి ఇలా అంది"మనిషి మహా స్వార్థం తో  చెట్లునరికి భవనాలు కడుతున్నాడు.చెరువులు కబ్జా చేసి పరిశ్రమలు పెట్టి మనకు విషవాయువు పంపుతున్నా డు.జలంకలుషితంచేయటమేకాక జింక  కుందేలు లాంటి జంతువులను చంపి తింటున్నాడు. నెమలిని ఈకలకోసం చంపితే అడవి పక్షులు అన్నీ భయపడుతున్నాయి.మనం సరిహద్దుల్లో కాపలాకాసి  మనల్ని మనమే కాపాడుకుందాము. పులి ఏనుగు లాంటి పెద్ద జంతువు లు సరిహద్దుల్లో ఉండాలి. ఎలుగుబంట్లు కోతులు  చెట్లపై నిఘా పెడతాయి.పక్షులు  పెద్దగా అరిచి  గోలచేయాలి." గాడిద  కుందేలుకి  ఏమీ చెప్పలేదు. ఆవిషయం గుర్తు చేసి నక్క  అంది"గాడిద  బరువు మోయటానికి తప్ప బుర్రలేనిది. కుందేలుకి ఎగురుతూ ఆడటం తప్ప ఏమీచేయలేదు."మిగతా వన్నీ  పకపకా హేళన గా నవ్వుతే పాపం అవి అవమానంతో తలవంచుకున్నాయి.సింహం  గర్జించింది"ఆపండి మీ ఎకసెక్కాలు.గాడిద పెద్దగా ఓండ్రపెడితే అది నగారాగా భావించి మనం విధులలో అప్రమత్తం కావాలి. కుందేలు  వార్తలు త్వరగా అందచేయగలదు.వాటి పైనే మనం ఎక్కువగా  ఆధారపడి ఉన్నాం అని గుర్తు పెట్టుకోవాలి. "అంతే అన్నీ సిగ్గు తో తలవాల్చాయి...