వైశాఖ మాస విశిష్టత :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
వసంతము తెస్తుంది వాసిగా రెండవది 
మాధవ మాసముగను మరి వైశాఖమ్మును 

యుగములను కృతయుగము యుక్తమగును వేదము 
తీర్ధముల సాటిగా తీరియున్నది గంగ 

మాసముల ఘనమైన మాసమే వైశాఖ 
శ్రీకరము శుభకరము శ్రీయుత కళ్యాణిగ

ఇంద్రుడు నగ్నియును ఈమాస మధిపతులు 
దానములు ధర్మమును దయచేసి చేయండి 

పాదుకలు గొడుగులును పట్టు వస్త్రమ్ములును 
నివాసము,చందనము నీటి పాత్రలునిమ్ము 

విసనకర్రల నివ్వు వీలైన విధముగా 
పసిమి ఛాయలనుండు పరిసరము నివసించు 

బాటసారుల కివ్వ బహుమంచి జలములును 
ఆహార ఫలమదియు ఆత్మలో నిలిచేను 

శ్రామికుల కష్టమును శ్రధ్ధగా గమనించు 
సాయమ్ము సేయగా సరి కృష్ణ  వైశాఖి  !