పద్యాలు : బెజగాం శ్రీజ , గుర్రాలగొంది

 1.ఆ.వె.
అమ్మనాన్నలొదిలి ఆయిద్దరుకలసి
పెళ్లి చేసుకొనిరి ప్రేమతోడ 
మురిసిపోయినతడు ముద్దునేపెట్టగా
పరవశించినాది పడతి యపుడు
2.ఆ.వె.
పూలు పండ్లనాడు పొంగిపోయినతడు 
ముద్దుపెట్టుచుండె మురిపెముగను
ఇష్టమందుతెలిపి ఇల్లాలిపైయెంతొ 
ప్రేమచూపినాడు బేధమనక