*గౌతమబుద్ధుడి జయంతి!* శుభాకాంక్షలు అందిస్తూ, *వెన్నెల అవతారం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 1.అహింస వెన్నెలై వెంటరాగా,
  పున్నమినాడు ప్రభవించాడు
పుడమికి జ్ఞానంప్రభోదించాడు,
 హింసాంధకార ప్రభాకరుడు!భువిలోనడయాడిన,                                                      
             దివ్యశశికాంతుడు!
2.అహింస పరమధర్మం!
   జ్ఞానం నిర్దేశించిన మార్గం !
  అహింసే జీవన పరమావధి!
  విశ్వమానవ శరణాగతి!
3.కళింగయుద్ధానంతరం,
 జీవితాంతంయుద్ధవిముఖుడు
ఆఅశోకుడు శాంతికాముకుడు,
విశ్వాన బౌద్ధమతవ్యాపకుడు!
స్వాతంత్ర్యసమరాన,
                  మనమహాత్ముడు,
అహింసావ్రతదీక్షపట్టాడు,
ఆంగ్లేయులను తరిమికొట్టాడు!
4.నేడు,
  ప్రపంచమంతా అనైతికత!
 ఈమధ్యనే *గాజాన*
                  యుద్ధతీవ్రత!
 ఐహికభోగాలకే ఆధిక్యత!
బుద్ధుని బోధనల,
             సాధనావశ్యకత!
శీలానికే ప్రథమ ప్రాధాన్యత!
5.ఎప్పడో! ఎక్కడో!
  పున్నమినాడే,
                  *చంద్రగ్రహణం!*
  పట్టడం, వీడడం ప్రకృతి!
  ఏ క్షణంలోనైనా మనిషి,
                 *బుద్ధి గ్రహణం!*
  పడితే వీడకపోవడం వికృతి!
    జీవుడు బుద్దుడు!
   నరుడు సిద్ధార్థుడు!
    విశ్వజనస్వీకృతం!