అక్షరం మణి పూసలు ( బాల గేయం):--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అక్షరం అంటే దీక్ష
అక్షరం అంటే నక్ష
అక్షరం తోడుంటే
మానవ బ్రతుకులో రక్ష

అక్షరం ఒకాయుదం
అక్షరం ఒక్క స్నేహం
అక్షరం తోడుంటే
మనిషికి నిజమైన బలం

అక్షరం మనకు జ్ఞానం
అక్షరం మదిన మౌనం
అక్షరం తోడుంటే
మనిషికి ఉండును ధైర్యం

అక్షరం జ్ఞాన భూషణం
అక్షరం సూర్య'కిరణం
అక్షరం తోడుంటే
మనిషికి సత్య గుణం