గణేశ:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బుజ్జాయి చదువుల
ఒజ్జవూ నీవూ
పూలతో నిను మేము
అర్చింతుమయ్యా
విఘ్న సంతతి బాపె
విఘ్నపతివి నీవు
వేగమే నిను మేము 
పూజింతుమయ్యా
ఎలుక వాహనమెక్కి
ఏతెంచె స్వామీ
షోడశ పత్రితో
అర్చింతుమయ్యా
కుడుములన్నీ నీకు
నైవేద్యమిడెదమూ
మా ఇడుములన్నీ
బాపుమో దేవా
వేయి ఉండ్రాళ్ళతో
విందుజేతుము నీకు
విజ్ఞతతో చదువులు
మాకివ్వుమో దేవా
కోటి రూపాలతో
కొలువైనవయ్యా
బాలలూ పెద్దలను
కావుమో దేవా!!