అమానవత్వం: - డా.. కందేపి రాణీప్రసాద్.
పక్క రాజ్యాలపై ఆక్రమణల్లోచనిపోతే
వీరాధి వీరుదని రాతి శాసనాలు
శత్రు దేశ సైనికుల పోరాటాల్లో మరణిస్తే
గౌరవప్రద సైనిక లాంఛనాలు

కనపడని శత్రువు కరోనాతో
కదన రంగంలో యుద్ధం చేస్తూ
అసహాయంగా అశువులు బాస్తే
అనామకుడిలా అంత్యక్రియలు

వేలమందిని ఉచకోత కోసే ఉగ్రవాదులకైనా
దేశ సమైక్యతను విచ్చిన్నం చేసే దేశద్రోహులకైనా
లక్షల కోట్లు మింగిన ఆర్థిక నేరగాళ్ళకైనా
మరణం తర్వాత సంప్రదాయ అంత్యక్రియలు చేస్తిరి!

ఏం పాపం పచేశాడా చెన్నై వైద్యుడు?
నీకు కరోనా వస్తే వైద్యం చెయ్యాలి
నీ వాళ్ళే కరోనా కాటుకు బలైతే
శ్మశానాలు మూసి రాళ్ళ దెబ్బలా!
శవానికి అమర్యాద ప్రవర్తనలా!

మానవత్వం చచ్చిపోయిందా?
అవకాశవాదం గెలుస్తోందా?