పచ్చగా జీవిద్దాము!:-- లక్ష్మి రెడ్డి, హైదరాబాద్

 రాబోయే కాలములో
తాగేందుకు ,
సాగు చేసేందుకు నీరు లేక
పంట పొలాల పచ్చదనం కూడా కరువగునేమో..
వ్యవసాయం పండించే రైతులు 
కానరారేమో..
తినేందుకు బువ్వ కరువగునేమో..
అందుకే..
ప్రకృతిని,పర్యావరణాన్ని
కాపాడుకుందాము
మనమే కాదు;
భావి తరాలవారు కూడా
పచ్చగా జీవిద్దాము!

కామెంట్‌లు